Reading Time: < 1 minute

వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో ఫైనల్ పోరుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్ధమయ్యాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబి కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

కాగా, లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్‌సిబి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఢిల్లీ మాత్రం ఎలిమినేటర్ పోరులో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమానంగా ఉన్న ఇరుజట్లు తలపడుతుండటంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది.