
హైదరాబాద్: దేశంలో ధైర్యంతో కులగణన చేసిన ఏకైక వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే లక్ష్యంగా సిఎం సాగుతున్నారని అన్నారు. గుమ్లాపూర్ లో సిఎం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యుడైన రేవంత్ ను సిఎం చేసిన ప్రజల రుణం తీర్చేందుకు కృషి చేస్తున్నారని, దీర్ఘకాలంగా తెలంగాణను పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపారని తెలియజేశారు. రాష్ట్రాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు సిద్ధమైందని, బిసిలకు ఉద్యోగాలు, రాజకీయాల్లో సమాన అవకాశాలు లభిస్తాయని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.