
ముంబై: భారతదేశంలో బంగారం, వెండిధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గాయి. ఫిబ్రవరి 2వ తేదీన ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి ధరరూ.23,000 (9 శాతం) తగ్గింది, దీంతో ఒక కిలో వెండి ధర రూ.2.41 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో బంగారం కూడా రూ.7,000 (6 శాతం) తగ్గింది, 10 గ్రాముల బంగారంరూ.1.40 లక్షలకుచేరింది. జనవరి 30నబంగారం, వెండి ధరలు భారీగా పడిపోయయి. ఫ్యూచర్స్ మార్కెట్ లోమల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్)లో బంగారం ధర రెండురోజుల్లో రూ.30,000 తగ్గింది. జనవరి 29న బంగారం రూ.1.69 లక్షలకు చేరగా, సోమవారం అది రూ.1.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.
అలాగే, వెండి ధరలురూ.1.60 లక్షలుతగ్గాయి. జనవరి 29న ఒక కిలో వెండి రూ.4.01 లక్షలుకి చేరగా, నేడు అది రూ. 2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబిజె ఎ) ప్రకారం, కిలో వెండి ధర రూ.3,39,350 కి పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరరూ.1,65,795కి తగ్గింది. మూడు రోజుల్లో బంగారం రూ.30,000, వెండి రూ.1.60 లక్షలు తగ్గాయి. ఇటీవల బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లాభాలను బుక్ చేసుకున్నారు. ఇది ధరలు తగ్గడానికి కారణమైంది.