
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ‘. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ‘ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కపుల్ ఫ్రెండ్లీ‘ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ “సంతోష్ శోభన్ స్క్రిప్ట్ చదివిన వెంటనే ఈ మూవీ చేద్దామని ఓకే చేశారు. అలా ‘కపుల్ ఫ్రెండ్లీ‘ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నిజాయితీతో కూడిన ప్రయత్నం చేశారనే ఫీల్ అందరిలో తప్పకుండా కలుగుతుంది. నేను ఈ కథ రాసినప్పుడు శివ, మిత్రతో పాటు కథ జరిగే చెన్నై నగరాన్ని కూడా ఒక పాత్రలా అనుకున్నాను”,అని అన్నారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “కపుల్ ఫ్రెండ్లీ‘ సినిమా మనసుకు హత్తుకుంది. సంతోష్ శోభన్ సినిమా అంతా అద్భుతంగా నటించారు. మానస వారణాసి తెలుగమ్మాయి. ఈ మూవీలో బాగా నటించింది. మనం ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటాం. కానీ ఇదొక విభిన్నమైన ప్రేమ కథ. ‘కపుల్ ఫ్రెండ్లీ‘ బ్లాక్ బస్టర్ అవుతుంది”అని పేర్కొన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “ఈ కథ ఇరవై ఏళ్ల పాటు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశాను. శివ అనే క్యారెక్టర్ కు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తా. ఇది నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మానస వారణాసి, కో ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు పాల్గొన్నారు.