Reading Time: < 1 minute

ఢాకా: రాజుక్ న్యూటౌన్ హౌసింగ్ అనే ప్రభుత్వ ప్రాజెక్టు లోని ప్లాట్ల కేటాయింపులో అవినీతి జరిగినట్టు రుజువు కావడంతో రెండు అవినీతి కేసుల్లో మాజీ ప్రధాని 79 ఏళ్ల షేక్ హసీనాకు పదేళ్లు జైలు శిక్ష పడింది. హసీనా తన అధికారిక పలుకుబడిని ఉపయోగించి తన మేనకోడలు, బ్రిటన్ లేబర్ ఎంపీ , మాజీ బ్రిటిష్ మంత్రి తులిప్ సిద్దిక్ సహా ఇతరులకు అక్రమంగా ప్లాట్లను కేటాయించారని ఢాకా స్పెషల్ జడ్జి కోర్టు ధ్రువీకరించింది. రాజధాని ఢాకాకు శివారులో పుర్బచోల్‌లో రాజుక్ న్యూటౌన్ హౌసింగ్ ప్రాజెక్టు ఉంది. జడ్జి రాబిల్ ఆలమ్ హసీనాతోపాటు ఆమె ఇద్దరు మేనకోడళ్లు, మేనల్లుడుకు వేర్వేరు జైలుశిక్షలు విధించారు.

సిద్దిక్ సోదరి అజమన్ సిద్దిక్, సోదరుడు రద్వాన్ ముజిబ్‌సిద్దిక్ బాబీలకు ఏడేళ్లు శిక్ష విధించారు. మిగతా నిందితుల్లో మాజీ హౌసింగ్ జూనియర్ మంత్రి , మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి మాజీ రాజుక్ చైర్మన్ , అధికారులకు ఐదేళ్లు వంతున శిక్ష విధించారు. ఈ కేసులో సరెండర్ అయిన రాజుక్ సభ్యుడు ఖుర్షీద్ ఆలమ్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. నిందితులు అందరికీ లక్ష జరిమానా విధించారు. జరిమానా కట్టకుంటే అదనంగా ఆర్నెళ్లు జైలు జీవితాన్ని అనుభవించాలి.