
న్యూఢిల్లీ : తమిళనాడు మాజీ సిఎం జయలలితకు భారత రత్న బిరుదు ప్రదాని చేయాలని ఆ పార్టీ ఎంపీ రాజ్యసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ఎఐఎడిఎంకె ఎంపి ఎం ధనపాల్ లేవదీశారు. ఆమె తన పాలనా కాలంలో అమ్మా కాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, విద్యార్థులకు ఉచిత లాప్‌టాప్‌లు, సైకిళ్లు పంపిణీ చేయించారని, మిక్సర్లు, గ్రైండర్లు వంటి గృహోపకరణాలను సబ్సిడీపై సరఫరా చేయించారని, మొత్తం మీద ఆమె సంక్షేమ పథకాలకు తల్లి వంటివారని ఎంపీ వివరించారు.
ఈ నేపథ్యంలో ఆమెకు భారతరత్న బిరుదు ప్రదానం చేయడమే సరైన నివాళి అని సూచించారు. ఆప్ ఎంపీ రాజీందర్ గుప్తా జిఎస్‌టి కౌన్సిల్ రీతిలో నేషనల్ ఫీస్కూల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ఎంపి కె లక్ష్మణ్ అన్ని రాష్ట్రాల్లో, దిగువ కోర్టుల్లో జడ్జిల నియామకానికి వీలుగా ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసులను ఏర్పాటు చేయాలని సూచించారు.