
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు జపాన్‌కు చెందిన ప్రపంచ 9వ ర్యాంక్ క్రీడాకారిణి టొమొకా మియాజాను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు 218, 2113 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. సింధు ధాటికి మియాజా కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది.
శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కే చెందిన యమగూచితో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. మలేసియాకు చెందిన జునేది అఫ్రిదిరాయ్ కింగ్ జంటతో జరిగిన పోరులో సాత్విక్ జోడీ 2118, 2112తో జయకేతనం ఎగుర వేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్షసేన్ పరాజయం చవిచూశాడు.