
తమిళ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్, చివరి సినిమా ‘జన నాయగన్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. అయితే, అనూహ్యంగా ఈ మూవీ వాయిదా పడింది. ఇప్పటి వరకు ఈ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో మేకర్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో మూవీని మేకర్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పటికే అభిమానులు భారీగా టికెట్ బుకింగ్స్ చేసుకున్నారు. ఇప్పటి వరకు బుక్ మై షోలో 4.50లక్షల టికెట్ బుకింగ్స్ జరిగాయి. సినిమా రేపు విడుదల కాకపోవడంతో తిరిగి రిఫండ్ చేస్తున్నారు. దీంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పెద్ద రీఫండ్ గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, విజయ్ సినిమా సెన్సార్ వివాదంలో రాజకీయ కోణం ఉన్నట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ ను ఇబ్బంది పెట్టేందుకు ఆయనపై కుట్ర జరుగుతోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, రిలీజ్ కు ఒక రోజు ముందు జన నాయగన్ వాయిదా పడటంతో పలువురు సినీ ప్రముఖులు విజయ్ కి మద్దుతు పలుకుతున్నారు.