Reading Time: < 1 minute

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుందని.. భారత రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ రద్దు చేయబోతున్నట్లు ఆరోపించారు. ఎన్డియే కూటమికి అనుకున్న మోజార్టీ రాకపోవడంతో.. రాజ్యాంగాన్ని మార్చలేకపోయారన్నారు. రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు కానీ.. వేరే రూపంలో హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కును తీసేసే కుట్రలో భాగంగానే SIRను తీసుకొచ్చారని విమర్శించారు. కోట్లాది మంది పేదలను దేశ పౌరులే కాదని చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. భూమి లేని పేదలకు ఆహారభద్రత కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ తెచ్చిందని.. కానీ, కేంద్రం ఆ పథకంపై కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.