Reading Time: < 1 minute

హైదరాబాద్: సిటీలోని అశోక్ నగర్ లో మరోసారి భారీగా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జాబ్‌ క్యాలెండర్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గురువారం సాయంత్రం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్దకు చేరుకుని సర్కార్ కు వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అశోక్ నగర్ లో భారీగా పోలీసులు మోహరించి.. నిరుద్యోగులను గుంపులుగా ఉండకుండా చెదరగొడుతున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్నారు. దీంతో అశోక్ నగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.