
రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బరోడా, ఛండీగఢ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బరోడా 49.1 ఓవర్లలో 391 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ప్రియాన్షు మోలియా సెంచరీతో చెలరేగాడు. జితేశ్ శర్మ, హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో ధాటిగా బ్యాటింగ్ చేశారు. బరోడా బ్యాట్స్‌మెన్లు ప్రియాన్ష మోలియా(106 బంతుల్లో 113 పరుగులు), హార్ధిక్ పాండ్యా(31 బంతుల్లో 75 పరుగులు), జితేశ్ శర్మ(33 బంతుల్లో 73 పరుగులు), విష్ణు సోలంకి(49 బంతుల్లో 54 పరుగులు), కృనాల్ పాండ్యా(20), నినాద్ అశ్విన్ కుమార్(38) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఛండీగఢ్ బౌలర్లలో జగ్‌జిత్ సింగ్ మూడు వికెట్లు తీయగా రోహిత్ దండా, హర్టీ జస్వీ కపూర్ చెరో రెండు వికెట్లు, నిశాంక్ బిర్లా, విషు కశ్యప్, తరణ్ ప్రీత్ సింగ్ తలో ఒక వికెట్ తీశారు.
ఛండీగఢ్ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 65 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బరోడా బౌలరల్లో రషిఖ్ దర సలమ్ రెండు వికెట్లు, హార్ధిక్ పాండ్యా చెరో ఒక వికెట్ తీశాడు.