
హైదరాబాద్: అర్ధరాత్రి మాజీ ఐపిఎస్ ఇంటి ముందు అగంతకుడు హల్ చల్ చేశాడు. మాజీ ఐపిఎస్ వికె సింగ్ ఇంటి ముందు తర్బీజ్ అనే వ్యక్తి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఐపిఎస్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. 30వ తేదీ అర్ధరాత్రి వికె ఇంటి ముందు తర్బీజ్ హంగామా సృష్టించాడు. రోడ్డు నిర్మాణం కారణంగా అధికారులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డును బ్లాక్ చేయడంతో అర్దరాత్రి హంగామా సృష్టించారు. వికె సింగ్ ఇంటి గేట్ ను కొడుతూ దాడి చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకోబోతే గన్ ను లాక్కునే ప్రయత్నం చేశాడు. 500 మందితో మీ ఇంటి మీదకు వస్తానని సింగ్ ను బెదిరించాడు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పర్సనల్ సెక్యూరిటీ జస్వంత్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.