Reading Time: < 1 minute

హైదరాబాద్: టి20 ప్రపంచ కప్ ముందు టీమిండియాకు షాక్ తగలింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు పొట్ట కింద భాగంలో గాయం కావడంతో శస్త్ర చికిత్స చేశారు. తిలక్ నాలుగు నుంచి ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌లు భారత్ ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉండడంలేదు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంతో రాజ్‌కోట్‌లో మ్యాచ్ ఆడుతుండగా కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు స్కానింగ్ చేసి ఆపరేషన్ చేశారు. ఇప్పటివరకు మరొక బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోలేదు. టి20 ప్రపంచ కప్ ముందు తిలక్ వర్మ గాయపడడం అనేది టీమిండియా పెద్ద ఎదురుదెబ్బ కానుంది. 2025 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 53 బంతుల్లో 63 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. తిలక్ బదులు జట్టులోకి ఎవరిని తీసుకుంటారు అనేది ప్రశ్నగా మారింది.