Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని తలారి చెరువు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. కొండపై చిరుత పులి సంచరిస్తున్నట్లు పోలీసులకు సెక్యూరిటీ గార్డులు సమాచారం ఇచ్చారు. సంచరిసున్న చిరుతను ఫొటోలు తీసి పోలీసులకు సెక్యూరిటీ గార్డులు పంపించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడక్కడ బోన్లు ఏర్పాటు చేశారు.