Reading Time: < 1 minute

హైదరాబాద్:  ముషీరాబాద్ పరిధిలోని బోలకుపూర్ న్యూ భాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆకాశమంత ఎత్తున ఎగిసిపడ్డాయి. భద్రత దృష్ట్యా అధికారులు చుట్టుపక్కల నివాస ప్రాంతాలను ఖాళీ చేయించారు. స్థానికుల మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. పక్కనే మరికొన్ని స్క్రాప్ గోదాములు ఉండటంతో మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.