Reading Time: < 1 minute

అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత వైసిపి వాళ్లకు ఉందా? అని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు జెసి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమలిఫ్ట్‌పై వైఎఆస్‌ఆర్‌సిపి వాళ్లు ఏం చేశారని నిలదీశారు. ధర్మవరం మాజీ ఎంఎల్‌ఎ వెంకట్రామిరెడ్డి రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడతున్నారని మండిపడ్డారు. తాడిపత్రి మాజీ ఎంఎల్‌ఎ పెద్దారెడ్డికి పౌరుషం లేదని విమర్శించారు. చీము రక్తం ఉంటే తాడిపత్రి రావాలని సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబానికి మాజీ సిఎం జగన్ ఈ సారి ఎంఎల్‌ఎ టికెట్ ఇవ్వరని దుయ్యట్టారు. ధర్మవరానికి వెంకట్రామి రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. సిఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని కేతిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆల్మట్టి విషయంలో మౌనంగా ఉండి ద్రోహం చేశారని.. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, బ్యాంకులు, హైకోర్టును కూడా తరలించుకుపోతున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం విధితమే.