
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘కానిస్టేబుల్ కనకం 2’ ఈ నెల 8న ఈటీవీ విన్‌లో రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ “కానిస్టేబుల్ కనకం నాకు చాలా ప్రత్యేకం. సీజన్ 2 అద్భుతంగా ఉంటుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ “సీజన్ 2 అదిరిపోయింది. చంద్రిక ఎక్కడ అనే సస్పెన్స్ అందరిలో ఉంది. ఈ సంక్రాంతికి అందరికీ మంచి వినోదాన్ని తీసుకొస్తున్నాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేఘలేఖ, నితిన్ చక్రవర్తి, సాయి కృష్ణ, సాయిబాబా, హేమంత్, సురేష్ బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.