Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని రుయా ఆస్ప‌త్రిలో అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి తనను కేటాయించిన గదిలో దుర్గేశ్వర్ (42) అనే అంబులెన్స్ డ్రైవర్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వాటర్ బాటిల్ కోసం వెళ్లిన తోటి డ్రైవర్ శేఖర్ గమనించి ఆర్ఎంఒ, సెక్యూరిటీకి సమాచారం ఇచ్చాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.