Reading Time: < 1 minute

సిడ్నీ: యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఐద టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి 4-1 తేడాతో యాషెస్ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు ఆస్ట్రేలియా 31.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ట్రావిస్ హెడ్(29), జాక్ వెథర్‌లాండ్(34), మార్నస్ లబుషింగే(37), ఉస్మాన్ ఖవాజా(06), అలెక్స్ కారే(16 నాటౌట్), కామెరూన్ గ్రీన్(22 నాటౌట్) పరుగులు చేశారు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 163, రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. యాషెస్ సిరీస్‌లో మిచెల్ స్టార్క్ 31 వికెట్లు తీయడంతో పాటు 156 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 384

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 567

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 342 

ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్: 161