Reading Time: < 1 minute

తిరువనంతపురం: ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కారుతో ఆమెను ఢీకొట్టించి అనంతరం ప్రమాదం నుంచి కాపాడి ఆమె తల్లిదండ్రుల ముందు సానుభూతి పొందాలని చూశాడు. ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన కేరళం రాష్ట్రంలోని పథనంథిట్ట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంజిత్ రంజన్ అనే యువకుడికి ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. రోడ్డు ప్రమాదం నుంచి ప్రియురాలిని కాపాడి ఆమె కుటుంబ సభ్యులతో హీరో అనిపించుకోవాలని రంజిత్ ప్లాన్ వేశాడు. 15 రోజుల క్రితం ప్రియురాలు స్కూటీపై కోచింగ్ సెంటర్ కు వెళ్తుండగా ఆమెను తన స్నేహితుడు అజాస్ కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మోచేయి, చేతి వేలు విరిగింది. వెంటనే రంజిత్ మరో కారులో వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రియురాలి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఎజెస్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజం బయటకు వచ్చింది. రంజిత్ తో పాటు అజాస్ హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.