Reading Time: < 1 minute

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, మొదటి మూడు పాటలతో భారీ అంచనాలను సృష్టించింది. ఈ జోష్‌ని కొనసాగిస్తూ, చిత్ర బృందం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది.

హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ.. “ఈసారి పండక్కి సరదా సరదాగా గోల చేద్దాం. ఇదొక్కటే కాదు.. వస్తున్న అన్ని సినిమాలు ఫుల్ ఎంటర్‌టైనర్‌లు. ఈసారి పూర్తి వినోదాన్నిచ్చే సంక్రాంతి ఇదవుతుందని నా ప్రగాఢ నమ్మకం”అని అన్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ “పాటలు, టీజర్‌కి మంచి స్పందన ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చూడాలని కోరుకుంటున్నాను”అని తెలియజేశారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ “ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫన్ ఫిల్మ్. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”అని తెలిపారు. డింపుల్ హయాతి మాట్లాడుతూ “రవితేజతో ఇది నాకు రెండో సినిమా. ఇది నా మొదటి సంక్రాంతి సినిమా”అని అన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఇదని పేర్కొన్నారు.