
మీర్జాగూడ: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ గా గుర్తించారు. ఐదుగురు విద్యార్థులు కారులో మోకిలా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.