Reading Time: 2 minutes

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత కీలకమైన 2027 జనాభా లెక్కల ప్ర క్రియ తొలి దశ ఖరారు అయింది. ఇందులో భాగంగా ముందుగా ఇళ్ల లెక్కలు, ఇళ్ల జాబితాల సేకరణ ప్రక్రియ (హౌస్ లిస్టింగ్ ) జ రుగుతుంది. దీనిని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ చేపడుతారని ప్రభుత్వం బుధవారం అదికారిక ప్రకటనలో తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ని ర్ణీత గడువు మధ్యలో ఖరారయిన వేర్వేరు తేదీలలో వరుసగా నెలరోజుల పాటు ఇంటింటి గణన జరుగుతుంది. నోటిఫికేషన్‌ను రి జిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ వెలువరించారు.. 130 కోట్ల జనాభా దాటిన దేశంలో ఈ జనాభా లెక్కల ప్రక్రియ అత్యంత బారీ విస్తృత బృహత్తర కార్యక్రమం కానుంది. పైగా కులాల వారి జన సంఖ్య కూడా వచ్చే వచ్చే ఏడాది చివరికి వెలువడనుంది. సెన్సస్ 2027 లో భాగంగా ఇంటింటికీ జనాభా సేకరణ కర్తలు వెళ్లి లెక్కలు సేకరిస్తారు. 15 రోజుల ముందుగానే పౌరులు తమ వివరాలను తెలియచేసుకునేందుకు స్వీయ ప్రకటన అవకాశం కల్పిస్తారని హోం మంత్రిత్వ శాఖ వెలువరించిన నోటిఫికేషన్‌లో తెలిపారు. 2021 లోనే జనాభా లెక్కల ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ సమస్యతో దీనిని వాయిదా వేయాల్సి 

వచ్చింది. రెండు దశలలో జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతుంది. ముందుగా ఈ ఏడాది ఎప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తరువాతి రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చేపడుతారు. రెండో దశ వివరాలను తరువాత తెలియచేస్తారు. జనాబా లెక్కల సేకరణ కార్యక్రమం (పిఇ) అనుకున్నంత తేలిక కాదు. నిజానికి ఇది భారీ చిట్టానే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సెన్సస్‌ను పద్ధతి ప్రకారం ఇంటి ఇంటికి , ప్రతి నిర్మాణానికి వెళ్లి చేపట్టేలా చర్యలు తీసుకుంటుంది. పౌరులు బాధ్యతాయుతంగా తమకు తామే పేర్లను నమోదుచేసుకునే స్వీయ ప్రకటిత విధానం అవకాశం వాడుకోవచ్చునని, దీని వల్ల తరువాత దీనిని తాము నిర్థారించుకునేందుకు వీలేర్పడుతుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. దేశంలో సమగ్ర పూర్తి స్థాయి జనాబా లెక్కల ప్రక్రియ బ్రిటిష్ వారి పాలనలో 1881 నుంచి 1931 మధ్యలో జరిగింది. అది పరాయిల పాలనలోనే. దేశ స్వాతంత్య్రం తరువాత జరిగిన జనాభా లెక్కలన్నింటిలోనూ కులాల వారీ వివరాలను లేకుండా నిర్వహించారు. ఇప్పుడు జరగబోయే జనాభా లెక్కలు తొలిసారిగా పూర్తి స్థాయిలో డిజిటల్ రూపంలో జరుగుతాయి. ఎక్కువగా కంప్యూటర్ పరిజ్ఞానం, ఆన్‌లైన్ సాంకేతికను వాడుతారు. మొత్తం 30 లక్షల మంది ఎన్యూమరేరటర్స్‌ను వినియోగిస్తారు. వీరికి ముందుగానే సరైన శిక్షణ ఉంటుంది. సరైన నాణ్యత గల డేటా కోసం వీరికి అండ్రాయిడ్, అధునాతన ఐఒఎస్ వెర్షన్స్ మొబైల్ ఫోన్ల సౌకర్యం కల్పిస్తారు.