
చార్మింగ్ స్టార్ శర్వా… రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను చేసిన నిత్య క్యారెక్టర్, ఈ కథ చాలా నచ్చాయి. తను అమాయకంగా కనిపించే అమ్మాయి. నిజాయితీగా ఉంటుంది. హీరో శర్వాతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమాలో నటించిన అందరూ కూడా చాలా మంచి కోస్టార్స్. షూటింగ్ సమయంలో వెన్నెల కిషోర్ నటనని చూస్తే చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. అలాగే ఇందులో నరేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సంయుక్తతో నాకు చాలా మంచి కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయి. ఇది ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇందులో మ్యూజిక్ రియల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా కొత్త అనుభూతిచ్చే పాటలు ఇవి. ఖచ్చితంగా థియేటర్స్‌లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.