Reading Time: < 1 minute

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్, కామెడీ, హర్రర్ థ్రిల్లర్ రాజాసాబ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. మరోవైపు, ఎపిలో ఈ మూవీ టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయి.

రాజాసాబ్ నిర్మాతల విజ్ఇప్తి మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించారు. స్పెషల్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక, జనవరి 9వ తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 పెంచుకోవడానికి అనుమతిస్తూ ఎపి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తెలంగాణలోనూ ఈమూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ చిత్ర నిర్మాతలు రాష్ట్ర హైకోర్టులో అప్పీలు చేశారు.