Reading Time: < 1 minute

హైదరాబాద్‌ సిటీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బుధవారం ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్తంగా నగరంలోని గచ్చిబౌలిలో దాడులు నిర్వహించింది. కోవ్‌స్టేస్‌ హోటల్‌పై ఈగల్ బృందం, పోలీసులు అకస్మిక సోదాలు చేశారు. హోటల్ లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడలు చేపట్టి భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. టెస్టులు నిర్వహించగా, ఐదుగురు డ్రగ్స్‌ తీసుకున్నారని నిర్ధారించినట్లు సమాచారం.ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.