Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో కీలక మైన వ్యక్తి అమన్ భైన్‌స్వాల్ ను అమెరికా నుంచి భారత్‌కు తీసుకు వచ్చేందుకు సిబిఐ మార్గం సుగమం చేసింది. బిష్ణోయ్ గ్యాంగ్‌లో అమన్ భైన్‌స్వాల్ షార్ప్‌షూటర్‌గా చెబుతున్న అమెరికాకు 2024లో పరారయ్యాడు. హర్యానా పోలీసుల అభ్యర్థనపై అమన్‌కు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ జారీ అయింది. హత్యలు, దాడులు, కుట్రలు తదితర నేరాలకు సంబంధించిన అనేక కేసుల్లో హర్యానా పోలీసులకు అమన్ భైన్‌స్వాల్ కావలసి ఉంది.

భైన్‌స్వాల్ భారత్‌లో ఇదివరకు అరెస్టు అయ్యాడు. తరువాత బెయిల్ పొందాడు. అయితే ఆ తరువాత విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. విదేశాలకు పరారైన 47 మంది నేరస్థులను భారత్‌కు తిరిగి రప్పించడానికి సిబిఐ సహకరించిందని అధికారులు తెలిపారు. 2026లో కూడా విదేశాలకు పరారైన నేరస్తులను తిరిగి భారీ సంఖ్యలో రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని సిబిఐ అధికారులు పేర్కొన్నారు.