Reading Time: < 1 minute

ఖమ్మంలో నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జరిగిన సర్పంచి ఎన్నికల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం సర్పంచ్‌లను బిఆర్ఎస్ గెలుచుకుందని అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి కార్పొరేటర్లను కాంగ్రెస్‌లో చేర్పించే పనిలో ఉన్నారని విమర్శించారు.