
టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు సానియా ఛందోక్‌తో త్వరలో అర్జున్ పెళ్లి జరగనుంది. సానియా మిస్టర్.పాస్ అనే లగ్జరీ పెట్ స్పా వ్యవస్థాపకురాలు, అదే సంస్థకు ఆమె డైరెకర్ట్‌గానూ ఉన్నారు. అర్జున్-సానియాలు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య స్నేహమే, ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకూ వచ్చింది. గతేడాది ఆగస్టులో ఇరువురి కుటుంబసభ్యుల మధ్య అర్జున్-సానియాల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం జరిగింది.
అయితే ఈ వేడుకను ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. కొద్ది రోజుల తర్వాత సచిన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ఏడాది మార్చి 5న వీరిద్దరి వివాహం జరుగనుందని నివేదికలు చెబుతున్నాయి. మార్చి 3వ తేదీ నుంచి వివాహ వేడుకలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఎక్కువ భాగం కార్యక్రమాలు ముంబైలోనే జరుగనున్నట్లు సమాచారం. అతిథుల జాబితాను కూడా ఇరు కుటుంబాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అర్జున్ ప్రస్తుతం గోవా తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతను ఓ మోస్తరు ప్రదర్శనలతో ఫర్వాలేదు అని అనిపిస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఐపిఎల్‌లో అర్జున్‌ను ముంబై నుంచి బేస్ ధర రూ.30 లక్షలకి లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్ చేసుకుంది.