
అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న నీళ్ల వివాదంపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. గోదావరి నీళ్లు మంజీరాకు తీసుకెళ్తే తాము అడ్డుకోలేదని తెలిపారు. గోవాదరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయన్నారు. నీళ్ల విషయంలో పోటీపడి మాట్లాడటం సరికాదని.. ప్రజలంతా ఆలోచించాలని అన్నారు. ప్రజల మధ్య విబేధాలు సృష్టించి ఆనందపడొద్దని హితవు పలికారు.