Reading Time: < 1 minute

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ చరిత్ర సృష్టించాడు. 41 ఏళ్ల వయస్సులో అరుదైన ఘనత సాధించాడు. టి-20ల్లో 12,000 పరుగుల మైలురాయిని తాకాడు. దీంతో ఈ రికార్డు సాధించిన పదో ఆటగాడిగా.. సౌతాఫ్రికా తరఫున ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత లేటు వయసులో (41 ఏళ్ల 178) రోజుల్లో డుప్లెసిస్ ఈ రికార్డు సాధించి.. షోయబ్ మాలిక్ రికార్డును (40 ఏళ్ల 315 రోజులు) అధిగమించాడు. సౌతాఫ్రికా టి-20 లీగ్ 2025-26లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 21 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.