Reading Time: < 1 minute

రంగారెడ్డి: ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియుడు తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ(17), మహేశ్(20) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తల్లికి తెలియడంతో కూతురుతో పాటు మహేశ్ మందలించింది. తల్లి చెప్పిన విధంగా కూతురు నడుచుకుంటుంది. అమ్మాయి తాతకు మహేష్ ఫోన్ చేయడంతో ఆమె లిఫ్ట్ చేసింది. తనని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని లేకపోతే చనిపోతాయనని యువతిని బెదిరించాడు. ఈ విషయం పూజ తన తల్లి అలివేలుకు చెప్పడంతో మంగళవారం ఉదయం లేచేసరికి యువతి దూలానికి ఉరేసుకుంది. మహేశ్ వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం మహేష్‌కు తెలియడంతో బ్రహ్మణపల్లి శివారులోకి వెళ్లాడు. బుధవారం ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకొని మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.