
హైదరాబాద్: రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ సినీ నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఓజీ, గేమ్ ఛేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకే వర్తిస్తాయని హైకోర్టు తెలిపింది. టికెట్ ధరల పెంచడంతో పాటు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని రెండు సినిమాల నిర్మాతలు ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో టికెట్ ధరలను పెంచకూడదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ, ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద సినిమాల నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో పాటు విడుదల చేసిన రోజు టికెట్ల రేట్లు పెంచుకోకపోతే ఆర్థికంగా నష్టపోతామని నిర్మాతలు తమ వాదనను వినిపించారు.