Reading Time: < 1 minute

సిడ్నీ: యాసెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 75 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 119 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు జాకోబ్ బెతెల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో స్వల్ప స్కోరు చేయాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ డకెట్(42), హరీ బ్రూక్(42), జెమీ స్మిత్(26), బ్రిడన్ కార్స్(16) పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లు బోలాండ్, వెబ్‌స్టర్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు కుప్పకూలిపోయారు. ఆసీస్ బౌలర్లలో వెబ్‌స్టర్ మూడు వికెట్లు, స్కాట్ బోలాండ్ రెండు వికెట్లు, మిచెల్ స్టార్క్, మిచెల్ నసర్ చెరో ఒక వికెట్ తీశారు. ఈ సిరీస్ లో 3-1 తో తేడాతో ఆసీస్ ముందంజలో ఉంది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 384

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 567