Reading Time: < 1 minute

రంగారెడ్డి: ఆర్ టిసి బస్సు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. కారు తన ముందున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆలూర్ గేట్ సమీపంలోని  పరిగి డిపోకు చెందిన ఆర్ టిసి బస్సు అదుపు తప్పి ముందున్న కారును ఢీకొట్టింది. కారు తన ముందున్న టిప్పర్ ను ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్ టిసి డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు పరిగి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం పరిగి డిపోకు చెందిన బస్సు రంగాపూర్ సమీపంలోని అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొన్న విషయం తెలిసిందే. చేవెళ్లలో నిరంతరం బస్సు ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్న విషయం విధితమే.