
ఛండీగఢ్: 20 ఏళ్ల తరువాత తొడలో నుంచి బల్లెట్ బయటకు వచ్చిన సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనేసర్‌లోని కోటా ఖండేవాలా గ్రామంలో కవిత అనే యువతి చదువుకుంది. 12 ఏళ్ల వయసులో ఒక పదునైన వస్తువు ఆమె కాలు తగిటినట్టు అనిపించింది. రాళ్లు తగలడంతో రక్తం కారిందని ఆమె బావించి చికిత్స తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తొడలో ఎలాంటి నొప్పి లేకలేదు. వారం రోజుల క్రితం తొడలో చిన్న కురుపు ఏర్పడింది. కురుపు పెద్దదిగా మారి చీము పట్టింది. చీముతో పాటు ఒక్కసారిగా తొడలో నుంచి బుల్లెట్ బయటకు వచ్చింది. ఖండేవాలా గ్రామానికి చేరువలో సైనిక శిక్షణ శిబిరం ఉంది. సైనికులు శిక్షణ తీసుకుంటుండగా బుల్లెట్ ఆమె తొడలోకి దిగినట్టు సమాచారం. గత 20 సంవత్సరాల నుంచి బుల్లెట్ తొడలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.