Reading Time: < 1 minute

బ్లాక్‌బస్టర్ మార్క్ సినిమాలో హీరోయిన్‌గా అలరించిన దీప్శిఖ చంద్రన్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న దీప్శిఖా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “మార్క్ నుంచి వచ్చిన స్పందన నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ప్రేక్షకులు నన్ను బలమైన క్యారెక్టర్స్‌లో అంగీక రించడం నా కెరీర్‌లో చాలా పెద్ద విజయం. నన్ను ఛాలెంజ్ చేసే పాత్రలను ఎంచు కుంటూ ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇక కిచ్చా సుదీప్‌తో కలిసి పని చేయడం నిజంగా గౌరవం భావిస్తున్నాను. తమిళ్, కన్నడ, తెలుగు సినిమాల్లో చేయడం ఆనందంగా ఉంది. అయితే -ఆరంభంలో కొంచెం ఛాలెంజ్‌గా అనిపించింది. కానీ తమిళ్, తెలుగు, కన్నడ – ఇండస్ట్రీలు నాకు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికాయి. సూర్య వశిష్ట్‌తో చేసిన ‘రమణి కళ్యాణం’లో నా క్యారెక్టర్ చాలా లేయర్డ్‌గా ఉంటుంది. సూర్య వశిష్ట్‌తో కెమిస్ట్రీ చాలా సహజంగా, రియలిస్టిక్‌గా ఉంటుంది”అని అన్నారు.