Reading Time: < 1 minute

అమరావతి: అనుమానంతో భార్యను భర్త చెంపదెబ్బ కొట్టడంతో ఆమె మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేడ్కర్ కోనసీమ జిల్లా బోడసకుర్రులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇల్వారిపాలెంలో శ్రీహరి, సౌజన్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో వీరి జీవితం హాయిగా కొనసాగుతోంది. అనుమానంతో భార్య చెంపపై భర్త కొట్టడంతో కిందపడిపోయింది. ఆమె అపస్మారక స్థితిలోకి పోవడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.