
జెరూసలెం: ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలెంలో బస్సు బీభత్సం సృష్టించింది. శామ్గర్ ప్రాంతంలోని యర్మియుహులో అందోళనకారులపైకి బస్సు అదుపుతప్పి దూసుకెళ్లడంతో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనె డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు నిర్బంధంగా సైనిక విధులు కేటాయించడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వారిపైకి బస్సు దూసుకెళ్లింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.