Reading Time: < 1 minute

అమరావతి: కదులుతున్న బస్సులో మంటల చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ ట్రావెల్స్ బస్సు ఖమ్మం నుంచి వైజాగ్‌కు కు వెళ్తుండగా కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్‌లో షార్ట్ సర్య్కూట్ జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. వెంటనే డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. దాదాపుగా రూ.80 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.