
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి తీసుకురాలేమని అందువ ల్ల భావి తరాల భవిష్యత్, నేల మనుగడ కోసం హిల్ట్ పాలసీ తీసుకువస్తున్నామని మంత్రి శ్రీధ ర్ బాబు అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించడం మన బాధ్యత అని చెప్పారు. మంగళవారం శాసనసభలో హిల్ట్ పా లసీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడి న ఆయన హిల్ట్ పాలసీని సాదాసీదా భూ మా ర్పిడిగా చూస్తున్నారని, కానీ ఈ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మా రుతోందన్నారు. పారిశ్రామిక వేత్తల భూములు ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారన్నా రు. హిల్ట్ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇ స్తామని, స్వచ్చందంగా ముందుకువస్తేనే భూ ములు కన్వర్ట్ చేస్తామన్నారు. పారదర్శకంగా ముందుకు వెళ్లేలా పాలసీ తీసుకువచ్చామని, 2013లోనే రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ ఔట ర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలని జీవో ఇ చ్చారన్నారు.
గత పాలకులు కూడా కేబినెట్ స బ్ కమిటీ వేశారని, గతంలో భూములు కన్వర్ట్ చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ప్ర శ్నించారు. ఇండస్ట్రియల్ పార్కులకు బీఆర్‌ఎస్ నేతలు వెళ్లినా వారిని ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ల్యాండ్ కన్వర్షన్‌కు ఫీజు తగ్గించాలని పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారని చెప్పారు. హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని 2020లో తీసుకు వచ్చామని, గ్రిడ్ పాలసీ కింద 11 ఇండస్ట్రియల్ ప్రాంతాలను ఐటీ కారిడార్లుగా మార్చాలని ప్రయత్నించినా కానీ నాడు ఎవ్వరూ ముందుకు రాలేదని స్పష్టం చేశారు. లీజు ల్యాండ్ ను ఫ్రీ హోల్ చేసిన గత పాలకులు మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో కవిత సభలో మాట్లాడారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ భూ వినియోగ మార్పిడి విషయంలో ఏ రకమైన విచారణ జరిపించాలో సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ అక్రమాల విషయంలో ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదన్నారు.
బేసిక్స్ తెలియకుండానే విమర్శలు
హిల్ట్ పాలసీ బయటకు రాకముందే విమర్శలు చేస్తున్నారని, బేసిక్ సమాచారం తెలియకుండా బీఆర్‌ఎస్, బీజేపీ విమర్శలు చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములు అడ్డగోలుగా ఇస్తున్నారని మాట్లాడుతున్నారని, కానీ దశాబ్దాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయని వివరించారు. హిల్ట్ పాలసీ విషయంలో సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. తమపై బురద చల్లాలని, విమర్శలు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రేపటి భాగ్యనగరం కోసం రాజకీయాలు పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. చైనాలో బ్లూ స్కై పాలసీ ద్వారా భారీ పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలించారని, పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేశారు. ఢిల్లీలోని నివాసాల మధ్య ఉన్న 168 పరిశ్రమలను తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు తీర్పు ప్రాతిపదికన హిల్ట్ పాలసీ తీసుకువచ్చామన్నారు. పూర్వీకులు స్వచ్ఛమైన ప్రకృతిని వారసత్వంగా అందించారు. రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రకృతిని అందజేస్తున్నామా లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతుందా అని ప్రశ్నించారు.
ఇప్పటికీ మేల్కోకపోతే కష్టమే
ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని శ్రీధర్‌బాబు చెప్పారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలివైపు తరలిస్తాని చెప్పారు. జీడిమెట్ల, ఉప్పల్, సనత్ నగర్, చర్లపల్లి, ప్రాంతాలు ఇండస్ట్రియల్ జోన్లుగా ఉండేవని, ఒక్కప్పుడు ఈ ప్రాంతాలు జనావాసాలకు దూరంగా ఉండేవని, కానీ ఈ 50 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంగా విస్తరించిందని చెప్పారు. ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలు ప్రస్తుతం రెసిడెన్షియల్ కాలనీస్ గా మారాయి. నాడు ఫ్యాక్టరీకి ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటే ఇప్పుడు ఫ్యాక్టరీ గోడకు ఆనుకునే ఇంటి గోడ ఉంటోందన్నారు.
పరిశ్రమల నుంచి వచ్చే పొగను ప్రత్యక్షంగా పీలుస్తున్నారని, పరిశ్రమలు, రెసిడెన్షియల్ ప్రాంతాలకు మధ్య బఫర్ జోన్లు లేకుండా పోయాయన్నారు. బఫర్ జోన్లు లేకపోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలు జరిగాయన్నారు. నగంరలోని భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని, పారిశ్రామిక రసాయనాల వల్లే భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు చేరాయన్నారు. ఇప్పటికీ మేల్కోకపోతే హైదరాబాద్ కూడా ఢిల్లీ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతి ఇంటికీ ఒక ఆసుపత్రి ఉంటుందని అందువల్ల హిల్ట్ పాలసీ విషయంలో సభ్యులు రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు.