Reading Time: 2 minutes

Live updates: మూడో విడత పంచాయతీ ఎన్నికలు

Caption of Image.

తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం  ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  లంచ్​ బ్రేక్​ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్​ ప్రక్రియ మొదలవుతుంది.

  • కరీంనగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.66% పోలింగ్ నమోదు
  • వరంగల్  నర్సంపేట మండలం లక్నపల్లిలో  వినూత్నంగా పోలింగ్ కేంద్రం..
  •  ఓటర్లను ఆకట్టుకునేలా హరిత పోలింగ్ కేంద్రంగా  తీర్చిదిద్దిన అధికారులు
  •  ఆహ్లాదకరమైన,  వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు..
  • కొబ్బరి మట్టలు… అరిటాకు ల తో పందిరి.. మామిడి తోరణాలతో స్వాగతం
  • ఎకో ఫ్రెండ్లీ గా నిలిచిన లక్నవరం పోలింగ్ కేంద్రం
  • కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం రాస్పెల్లి గ్రామ సర్పంచ్  అభ్యర్థి బోమ్మెళ్ల రాజయ్య ఓటమి బయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రికి తరలింపు
  • మహబూబ్‌నగర్ జిల్లాలో  మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం గ్రామపంచాయతీలు 563, ఏకగ్రీవం 52, ఎన్నికలు జరగని ప్రాంతాలు 7, మిగతా 504 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు  ఓటర్లు.
 
  • మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉత్సాహంగా క్యూ కట్టారు. అభ్యర్థులు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది..
 
  • నిర్మల్ జిల్లా ముథోల్ సెగ్మెంట్ లోని భైంసా, కుభీర్, తానూరు, బాసర, ముథోల్ మండలాల్లో 124 జీపీల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే గ్రామీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. క్యూ పద్ధతిలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

 

  • ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి..7 గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు.. అదిలాబాద్ జిల్లాలో బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరేడిగోండ, గుడిహత్నూర్, తలమడుగు మొత్తం 6 మండలాలలో ఏకగ్రీవం మినహా 120 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి
 
  • పెద్దపల్లి జిల్లాలో తుది  విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 243 గ్రామపంచాయతీలు, 2432వార్డులు ఉన్నాయి..
  • కరీంనగర్ జమ్మికుంట మండలం కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుంటన్న స్థానికులు
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడు మండలాలకు మూడో విడత   ఎన్నికలు 65 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయాన్నే పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్లకు ఖాళీగా ఉన్న  బ్యాలెట్ బాక్స్ ను చూపెడుతూ సీల్ వెశారు.

3,547 కేంద్రాల్లో వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్​.. 

మూడో విడత పోలింగ్‌‌‌‌‌‌‌‌ కోసం 36,483 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్​ నిర్వహించనున్నారు.  4,502 మంది ఆర్వోలు, 77,618 మంది  పోలింగ్​సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 43,856 బ్యాలెట్​ బాక్స్‌‌‌‌‌‌‌‌లను అందుబాటులో ఉంచారు. పోలింగ్‌‌‌‌‌‌‌‌కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటా తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

©️ VIL Media Pvt Ltd.