Reading Time: < 1 minute

తమిళనాడులో కటౌట్లు పెట్టి సీఎం అయ్యారు..ఇక్కడ నన్ను15 ఏళ్లు రోడ్డు మీద దేకించారు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Caption of Image.

తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా జరిగాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.  తనకు అసూయ కలిగేంత సుఖంగా సాగాయన్నారు. అక్కడ కటౌట్లు, హలోగ్రామ్స్ పెట్టుకుని గెలిచేసి సీఎంలు అయ్యారని.. కానీ తనను మాత్రం 15 ఏళ్లు రోడ్డు మీద దేకించినా అంటూ నవ్వారు పవన్ . తనకు ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు పట్టిందని.. రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు పవన్ .

అదే సమయంలో సొంత పార్టీ నేతలకు కూడా పవన్ గట్టి క్లాస్ పీకారు. శత్రువులు ఎక్కడో లేరని, మన పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. జనసేనలోనూ అనేక అంశాలపై లీకులు ఇస్తున్న వాళ్లు ఉన్నారని.. ఉండగలిగే వాళ్లే పార్టీలో ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నలిగి నలిగి ఉన్నామని, ఇకపై అలా కుదరదని.. ఇకపై జనసేన కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే తాము బలంగా కొడతామన్నారు. వ్యక్తిగతంగా విమర్శిస్తే అంతే స్థాయిలో తిరిగిస్తానని హెచ్చరించారు.

జనసేన నాయకులు బలపడాలని.. కానీ నేతలు చప్పబడిపోయారని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులు రాగానే చాలామంది మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదన్నారు. తన ఆదేశాలు పాటించాలని, లేదంటే పార్టీ నుంచి తప్పుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. తాను టీడీపీ కోసం కాదు, రాష్ట్రం కోసమే సర్దుకుపోతున్నానని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు.

 

©️ VIL Media Pvt Ltd.