Reading Time: < 1 minute

హైదరాబాద్ సిటీలో ఓ వైపు ఎండ.. మరో వైపు భారీ వర్షం

Caption of Image.

హైదరాబాద్ వాసులకు ఊరట..గత కొద్ది రోజులుగా ఎండ, వేడిమి, ఉక్కపోతతో సతమతమవుతున్న సిటీ ప్రజలకు కాస్తంత ఊరట లభించింది.. సోమవారం (మే25) సాయంత్రం సిటీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.. ఉన్నట్టుంది మబ్బులు కమ్ముకున్నాయి..వెంట వెంటనే వర్షం వాతావరణం చల్లబడటంతో ఎండ, వేడిమినుంచి ఉపశమనం లభించడంతో జనం పులకరించిపోయారు. 

హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ లో  భారీవర్షం కురిసింది. పంజాగుట్ట, యూసుఫ్ గూడలో తేలికపాటి వర్షం పండింది. మరోవైపు ఉప్పల్, రామంతాపూర్, ఎల్బీనగర్, ఫీర్జాదిగూడ, వనస్థలిపురం, నాగోల్ లలో మోస్తరు వర్షం పడింది.  సిటీ శివారు ప్రాంతాలైన ఘట్ కేసర్, కీసరలో కూడా భారీ వర్షం కురిసింది. రానున్న రెండు గంటల్లో సిటీలోమరికొన్ని చోట్ల వానపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

©️ VIL Media Pvt Ltd.