Reading Time: < 1 minute

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Caption of Image.

తొగుట (దుబ్బాక), వెలుగు: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం  దుబ్బాక 100 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ప్రజలకు  అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులపై డాక్టర్లు, సిబ్బందితో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్లను ఆదేశించారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో నార్మల్ డెలివరీలు పెరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు దుబ్బాక మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. కో ఆప్షన్ సభ్యులుగా గోనెపల్లి దేవలక్ష్మి సంజీవ్ రెడ్డి, ఆస యాదగిరి, ఎండీ ఖలీల్, ఎండి నసీంలు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ శ్రీరామ్ సంగీత, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు .

©️ VIL Media Pvt Ltd.