Reading Time: 2 minutes

Weather update: భగ్గుమంటున్న భానుడు…ఓ పక్క నిప్పుల కుంపటి.. మరో పక్క వర్షాలు పడే అవకాశం..

Caption of Image.

తెలంగాణలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. రోహిణి కార్తె రాకముందే ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. అగ్నిగోళంలా మారుతున్న ఆకాశం నుంచి నిప్పులు కురుస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

 తెలంగాణ రాష్ట్రం  నిప్పుల కుంపటిలా ఉంది.  రోజు రోజుకు సూర్యుడు భగ భగ మండిపోతున్నాడు.  ఎండ వేడికి పొద్దున్నే 9 గంటలకే సుర్రుమంటుంది. మరో రెండు మూడు రోజులు కొనసాగనున్నా  భానుడి భగభగలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. ఎండ తీవ్రతతో పాటు వేడి గాలులు , వడ గాలుల పెరుగుతున్నాయి. 

 ఆదిలాబాద్, కొమరం బీమ్, ఆసిఫాబాద్,నిర్మల్ నిజామాబాద్ , జగిత్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది ఉదయం 11 గంటల నుండి సాయంత్రం  4 గంటల మధ్య  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు, హెచ్చరికలు జారీచేశారు.  ఐదు సెంట్రల్ జిల్లాలు మినహా,  మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

ఇదిలా ఉండగా   బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో   అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.  ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ( 2026 ఏప్రిల్​ 28) ఏర్పడింది.

నిన్న  ( 2026 ఏప్రిల్​ 27) మధ్యప్రదేశ్  మధ్య ప్రాంతం నుండి  కొమరెన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు( 2026 ఏప్రిల్​ 28)  ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాహత ఆవర్తనం నుండి అంతర్గత కర్ణాటక రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో  కొనసాగుతోంది.

ఈరోజు ( 2026 ఏప్రిల్​ 28)   ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపటి నుండి( 2026 ఏప్రిల్​ 29)  రెండు రోజుల పాటు వర్ష తీవ్రత మరింత పెరిగడంతో పాటు.. వడగళ్లు, పిడిగులు పడే  అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

‌‌‌‌‌‌‌‌‌‌

©️ VIL Media Pvt Ltd.