
మూఢ నమ్మకాలకు మానవత్వం బలైపోయిన ఘటన ఇది. కుటుంబ పెద్ద చనిపోయి పుట్టెడంత దుఖంలో ఉన్న కుటుంబానికి అంతకు మించిన నరకం చూపించారు ఇంటి ఓనర్లు. దినాలు (దశదిన కర్మ) పూర్తయ్యే వరకు ఇంట్లోకి రావద్దని చెప్పడంతో.. పిల్లలతో పాటు శ్మశానంలోనే గడపాల్సి వచ్చింది ఆ కుటుంబం.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్ అనే వ్యక్తి వృత్తి పరంగా ఆటో డ్రైవర్. సొంత ఇల్లు లేదు. దీంతో కరీనంగర్ టౌన్ లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటుంది ఆ ఫ్యామిలీ. కుటుంబ పోషణ, పిల్లల చదువులతో.. ఆర్థిత సమస్యలతో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇంటి పెద్దను కోల్పోయినా పిల్లలకు మానసిక ధైర్యం చెబుతూ అంతిమ సంస్కారాలను పూర్తి చేసింది అతని భార్య.
భర్త పోయిన దుఖంలో ఉన్న ఆ కుటుంబానికి మూఢ నమ్మకాలతో ఇంటి ఓనర్ పెట్టిన కండిషన్ నరకంలా తయారైంది. 2 రోజుల వరకు అంటే దినాలు పూర్తయ్యేలోపు ఇంట్లోకి రావద్దన్న కండిషన్ పెట్టారు ఆ ఇంటి ఓనర్లు. దీంతో దిక్కు తోచని స్థితిలో శ్రీకాంత్ కుటుంబం స్మశానంలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఒకవైపు శవాలు కాలుతుంటే బిక్కుబిక్కుమంటూ భయంతో నిద్రహారాలు లేని స్థితిలో గడుపుతున్నారు. రోడ్డున పడ్డ తమను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నారు.