
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 28న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు.
మంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా ధర్మపురి ఆలయానికి వచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంత్ రావు మంత్రికి ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు.
మంత్రి వివేక్ రాకతో ఆయల సిబ్బంది భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికఆరు. తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు ఆలయ ఈవో శ్రీనివాస్.