Reading Time: 2 minutes

Jana Nayagan: విజయ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. మే4న ఓట్ల లెక్కింపు, అదే వారంలో జన నాయగన్ రిలీజ్!

Caption of Image.

తమిళనాడు ప్రజల దృష్టి అంతా మే 4న జరిగే అసెంబ్లీ ఓట్ల లెక్కింపు పైనే ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో విజయ్‌ టీవీకే పార్టీ బరిలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయ్‌ వ్యక్తిగత చరిష్మా, అనూహ్యంగా పెరిగిన పోలింగ్‌ శాతం, ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం వంటి కారణాలు టీవీకే పార్టీ విజయం సాధిస్తోందని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇపుడు ఈ టాక్ విజయ్ ఫ్యాన్స్లో ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే మరో సాలిడ్ అప్డేట్ ఒకటి విజయ్ అభిమానులను ఖుషి చేస్తోంది. అదే వాయిదాల మీద వాయిదాలతో సతమతం అవుతున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) రిలీజ్. వివరాల్లోకి వెళితే.. 

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమవుతోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని కొత్త టాక్ మొదలైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ వార్త డబుల్ హ్యాపీని అందిస్తుంది.

ఓ వైపు రాజకీయాలను ‘శాసించే నాయకుడిగా మే4, ఇక వెండితెరపై చివరి సంతకంగా మే8..’ నిలుస్తుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

సెన్సార్ సమస్యలు పరిష్కారం..

‘జన నాయగన్’(Jana Nayagan) విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సెన్సార్ బోర్డుతో ఉన్న సమస్యలు, రాజకీయ సమీకరణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవుతోంది. పొంగల్ రేసులో జనవరి 9న ఉంటుందని భావించినా, అది కుదరలేదు. రూ.100 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చినప్పటికీ రిలీజ్ ఆగిపోయింది. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయి విడుదలకు మార్గం సుగమమైందని టాక్. ఈ క్రమంలోనే KVN ప్రొడక్షన్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 

ఆన్‌లైన్‌లో లీక్.. జనాలు థియటర్స్కి వస్తారా?

ఇటీవల ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం కూడా చర్చనీయాంశమైంది. థియేటర్లలో విడుదలకు ముందే పూర్తి సినిమా పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవ్వడం నిర్మాతలు మరియు అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. దీని వల్ల బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, విజయ్ స్టార్‌డమ్ వల్ల అభిమానులు థియేటర్లకు భారీగా రానున్నారు. ముఖ్యంగా ఇది ఆయన చివరి సినిమా అని ప్రచారం జరుగుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది.

దర్శకుడు భావోద్వేగం..

దర్శకుడు హెచ్. వినోద్ ఈ ఘటనపై అత్యంత భావోద్వేగంతో స్పందించారు. ప్రతి సీన్ వెనుక ఎంతోమంది కలలు, కష్టం దాగి ఉన్నాయి. విడుదలకు ముందే ఇలా లీక్ అవ్వడం వెన్నుపోటు లాంటిది. దయచేసి ఎవరూ ఆ లింకులను షేర్ చేయకండి, థియేటర్లోనే సినిమాను చూడండి అని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

జన నాయగన్ మూవీలో విజయ్ మాజీ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, విలన్ పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమిత బైజు తదితరులు నటిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.