Reading Time: < 1 minute

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్

Caption of Image.

హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో గత మార్చి 14న రాత్రి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 

ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేయగా.. ఇందులో రోహిత్ రెడ్డికి మాత్రమే బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రోహిత్ రెడ్డికి మాత్రమే న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో చంచల్ గూడ జైలు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం విడుదల కానున్నారు.

మార్చి 14న రాత్రి మొయినాబాద్‌లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో పోలీసులు సోదాలు చేశారు. పార్టీలో డ్రగ్స్, మద్యం తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులపై ఫామ్ హౌస్లో కాల్పులు జరిపినట్లు మొహినాబాద్ పోలీస్ స్టేషన్ SI నయిమ్ఉద్దీన్ ఫిర్యాదు చేశారు. వారి నుంచి జర్మనీ తయారీ చెందిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. ఒక లైవ్ రౌండ్, నాలుగు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు సీజ్ చేశారు. 

పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. భారీగా విదేశీ మద్యం బాటిళ్లు, 48 బీర్ బాటిళ్లు, డాన్ జూలియో, రాయల్ సల్యూట్, చీవాస్, బెల్వెడేర్ వోడ్కా సీజ్ చేశారు. పార్టీకి హాజరైన 10 మంది పురుషులు, ఒక మహిళపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.